నరసాపురం: నారసింహుడి అవతారంలో శ్రీవారు

351చూసినవారు
నరసాపురం: నారసింహుడి అవతారంలో శ్రీవారు
నరసాపురం మండలం వేములదీవి పడమర (కాపుల కొడప) గ్రామంలోని శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామివారిని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అవతారంలో అలంకరించారు. ఉదయం నుంచే అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. నరసింహ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్