నరసాపురం: ఏడేళ్ల బాలికపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక వేధింపులు

1701చూసినవారు
నరసాపురం: ఏడేళ్ల బాలికపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక వేధింపులు
నరసాపురంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల బాలికపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఈనెల 4న స్కూల్ ముగిసిన తర్వాత వ్యాన్‌లో ఇంటికి వస్తుండగా, డ్రైవర్ నక్కా మహేంద్ర బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భయపడిపోయిన చిన్నారి ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులకు వివరించింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్