మదర్ థెరిసా దివ్యాంగ సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ కాశీరాం జ్యోతి తండ్రి ఇటీవల మరణించడంతో, సంఘం నాయకులు ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. నరసాపురం నియోజకవర్గ దివ్యాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిక్కాల వాసు, సెక్రటరీ ఉందుర్తి రాబర్ట్ ఆధ్వర్యంలో జ్యోతిని పరామర్శించి, సంఘం తరఫున రూ. 10,000 ఆర్థిక సాయం అందించారు. సంఘం కోసం కృషి చేస్తున్న జ్యోతి కుటుంబానికి ఇది చిన్న భరోసా అని అధ్యక్షుడు చిక్కాల వాసు పేర్కొన్నారు.