పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం శారద హాలు రోడ్డులోని శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో సోమవారం పురాణం గణేష్ ఆధ్వర్యంలో భక్తులచే సుగంధ ద్రవ్య పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అభిషేకాలు అనంతరం స్వామివారిని అలంకరించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.