జాతీయ టీకాకరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నర్సాపురం మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పట్టణంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక 12వ వార్డు పార్క్ రోడ్డులోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న మెటర్నిటీ సెంటర్‌లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 0–5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. నర్సాపురం పురపాలక సంఘ పరిధిలోని ప్రధాన కూడళ్లలో పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు.