తుపాను బాధితులకు అండగా నిలిచిన రాపిడో కెప్టెన్లు

8చూసినవారు
తుపాను బాధితులకు అండగా నిలిచిన రాపిడో కెప్టెన్లు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బుధవారం రాపిడో సంస్థకు చెందిన 15 మంది కెప్టెన్లు మానవతా దృక్పథంతో తుపాను బాధితులకు అండగా నిలిచారు. స్థానిక నాయకుడు, సామాజికవేత్త తెన్నేటి సురేష్ కన్నా మాదిగ ఆధ్వర్యంలో 1వ వార్డు, లాకు పేటలో సుమారు 200 మంది బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ కన్నా మాదిగ మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందించిన రాపిడో కెప్టెన్ల కృషిని అభినందించారు.

సంబంధిత పోస్ట్