రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలి.. సిఐ

1141చూసినవారు
నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం సిఐ ఆకుల రఘు రౌడీ షటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పట్టణంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించేది లేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి సేవించిన, విక్రయించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, రౌడీ షీటర్లపై 24 గంటలు నిఘా ఉంటుందని తెలిపారు. అందరూ సత్ప్రవర్తనతో ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్