పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వలందరేవులో రేపు సాయంత్రం గోదావరి మాతకు విశేష హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచనం అనంతరం గోదావరి మాతకు హారతి ఇవ్వబడుతుంది. విశ్వహిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని విశ్వహిందూ పరిషత్తు ప్రఖండ అధ్యక్షులు, కార్యదర్శులు రంగప్రసాద్, కైలాబాను, మొగుడా సత్యనారాయణ తదితరులు కోరారు.