పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీ పాలెం నార్త్ గ్రామంలోని శ్రీ భూ సహిత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అంగర వెంకట సింగరాచార్యులు ఆధ్వర్యంలో భక్తులు సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అభిషేక పూజలు చేశారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.