పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం స్వరాజ్యరామంలో వేంచేసియున్న శ్రీ షిరిడి సాయి మందిర్ లో గురువారం సందర్భంగా అర్చకులు సాయి కార్తీక్ ఆధ్వర్యంలో భక్తులుచే ప్రత్యేక పూజలు జరిగినవి. అనంతరం బాబా వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం హారతి అనంతరం బాబా వారికి పల్లకి సేవ, పంచ హారతులు ఇస్తామని కమిటీ సభ్యులు కస్తూరి శ్రీనివాస్ తెలియజేశారు.