పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లలిత ఘాటులో కొలువైన శ్రీ సూర్యనారాయణ మూర్తి స్వామి వారికి ఆదివారం ప్రత్యేక అభిషేక పూజలు అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు.