పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం మండలం కోమటితిప్ప గ్రామంలో రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభం ఒరిగి కొబ్బరి చెట్టు ఆసరాగా నిలబడి ఉంది. ఈ స్తంభం పడితే ప్రాణనష్టం వాటిల్లుతుందని స్థానికులు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ గాలులు వీచినప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.