మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో ఆదివారం ఇద్దరు యువకులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ కు చెందిన ఉమామహేశ్వరరావు (37) మృతదేహం అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విద్యార్థి సుభాష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.