
నరసాపురం: దివ్యాంగులకు ఇంద్రధనస్సు పథకం
నరసాపురంలోని వలందర్ రేవు వద్ద దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఇంద్రధనుస్సు పథకాలు అమలులోకి వచ్చిన సందర్భంగా పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కేక్ కట్ చేసి దివ్యాంగులకు తినిపించారు. ఎన్డీఏ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు.





































