ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ సభ్యులు, ఆంగ్ల భాషా నిపుణులు, విశ్రాంత ఉపాధ్యాయులు మాడభూషి కృష్ణ ప్రసాద్ బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన రచించిన 'హిస్టరీ ఆఫ్ ఇండియన్ జర్నలిజం' పుస్తకం ఆదికవి నన్నయ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా బోధించబడుతుంది. పిల్లల సాహిత్యంపై అనేక పుస్తకాలు రచించిన ఆయన రచనల్లో మేడంక్యూరీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుస్తకాలు విశేష ప్రచారం పొందాయి. గోపాల్ బండ కథలతో సహా అనేక కథల పుస్తకాలు కూడా ఆయన రాశారు. ప్రస్తుతం ఆయన రచించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర బయోపిక్‌గా తెరకెక్కనుంది.