
నూజివీడు: నిలువెల్లా పూలతో కనువిందు
నూజివీడు పట్టణంలో శ్రీ ఉమామహేశ్వర థియేటర్ సమీపంలో నాగమల్లి చెట్టు నిండుగా పూలతో కనువిందు చేస్తోంది. కార్తీక మాసం పర్వ దినోత్సవాల సందర్భంగా ఈ నాగమల్లి పూలతో పరమేశ్వరుని పూజించి, ధ్యానించడం ద్వారా కోరికలు నెరవేరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అరుదైన దృశ్యం భక్తులను ఆకట్టుకుంటోంది. మీ ఊర్లోనూ ఈ చెట్టు ఉందా అని ప్రజలను ప్రశ్నిస్తున్నారు.




































