నూజివీడు మండలం మీర్జాపురంలో గురువారం వేగంగా వచ్చిన మట్టి ట్రాక్టర్, ముందు వెళుతున్న లారీని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని 108 అంబులెన్స్‌లో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చెరువుల నుంచి మట్టిని తరలించే ట్రాక్టర్లు అతివేగంతో నడపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.