నర్సాపురం అంబేద్కర్ సెంటర్ లో ఆదివారం కూటమి నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. టీడీపీ ఇన్చార్జి పొత్తూరి రామరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబటి రాంబాబు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.