చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రైతు చిన్నం లక్ష్మీ నారాయణ మొక్కజొన్న చేలోకి శుక్రవారం రాత్రి పొలంలోకి వెళ్లాడు. ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ట్రాన్స్ఫార్మర్ వద్ద మృతి చెంది ఉన్నాడు. పోలీసులు శనివారం ఘటన స్థలానికి చేరుకొని తర్యాప్తు చేస్తున్నారు.