చింతలపూడి: బంగారం యాజమాన్యానికి అప్పగింత

690చూసినవారు
చింతలపూడి: బంగారం యాజమాన్యానికి అప్పగింత
చింతలపూడి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కనకదుర్గ ఫైనాన్స్ చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 4.490 కిలోల బంగారు ఆభరణాలను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, పోలీస్ ప్రధాన కార్యాలయంలో కనకదుర్గ ఫైనాన్స్ అధికారులకు శనివారం అధికారికంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జ్ డీఎస్పీ రవిచంద్ర కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్