నూజివీడు పట్టణంలో, పరీక్ష సమయం కావడంతో ఆలస్యంగా వస్తున్న ఓ విద్యార్థినిని కానిస్టేబుల్ బాడిశ శివన్నారాయణ సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలించారు. బుధవారం శ్రీ మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వస్తున్న విద్యార్థినిని గమనించిన కానిస్టేబుల్, తన బైకుపై పరీక్షా కేంద్రానికి చేర్చడంతో అందరి ప్రశంసలు పొందారు. ఈ సంఘటన ఏలూరు, నూజివీడు ప్రాంతాలలో జరిగింది.