నాలుగేళ్ల కిందట భార్య వెళ్లిపోయిందని మనస్తాపం చెంది భర్త పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన నూజివీడులో తుక్కులూరులో శుక్రవారం చోటుచేసుకుంది. బొక్కినెల శామ్యూల్(50) భార్య కొద్దికాలంగా పుట్టింటికి వెళ్ళిపోయింది. తన జేబులో అధిక మొత్తంలో ఉన్న డబ్బులు మాయమయ్యాయి. భార్య ఉంటే ఇలా జరిగేది కాదంటూ మనస్తాపం చెంది పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఏఎస్ఐ శేఖర్ తెలిపారు.