ముసునూరు మండలం లోపూడిలో అప్పుల వ్యవహారం తీవ్ర విషాదానికి దారితీసింది. గత నెల 29న పేరం శ్రీనివాసరావు, తీగల తిరుపతిరావుల మధ్య జరిగిన గొడవలో తిరుపతిరావుకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మృతి చెందారు. మృతుడి తల్లి తీగల ముత్తమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.