నూజివీడులోని స్త్రీ శక్తి భవన్‌లో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. మహిళల ఆర్థిక పురోభివృద్ధికి సీఎం చంద్రబాబు చేయూత అందిస్తున్నారని ఆయన వివరించారు.