నూజివీడు మండలం, గొడుగువారిగూడెం గ్రామంలో బుధవారం జరిగిన పేదల సేవా కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొన్నారు. అనంతరం, ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేసి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో తీసుకుంటున్న జాగ్రత్తలు, లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్లు అందిస్తున్న విషయాలను ఆయన వివరించారు.