నూజివీడు: 'మీ పాలన గురించి ప్రజలకు చెప్పండి'

1844చూసినవారు
నూజివీడులో శనివారం మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మామిడి, పొగాకు, కోకో, కాఫీ, టమాటా, ఉల్లి రైతులను ఆదుకుంటోందని తెలిపారు. వైసీపీ పాలనలో రైతులను ఏ విధంగా ఆదుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రూ. 6,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకుంటోందని, గత ప్రభుత్వం రూ. 3,000 కోట్ల నిధితో ఎంత మందిని ఆదుకుందో చెప్పాలని జగన్‌ను నిలదీశారు.