నూజివీడు: అసాంఘిక శక్తులకు నిలయంగా జడ్పీ అతిథి గృహం

3చూసినవారు
నూజివీడు: అసాంఘిక శక్తులకు నిలయంగా జడ్పీ అతిథి గృహం
నూజివీడులోని జిల్లా పరిషత్ అతిథి గృహం నిర్లక్ష్యం కారణంగా అసాంఘిక శక్తులకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ భవనం సరైన పర్యవేక్షణ లేక పేకాట రాయుళ్లు, తాగుబోతులకు అడ్డాగా మారిందని పలు ప్రజా సంఘాల నాయకులు శనివారం ఆరోపించారు. మరమ్మతులు చేపట్టి శుభకార్యాలకు, వేడుకలకు అద్దెకు ఇస్తే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభిస్తుందని వారు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్