నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సూరంపాలెం లోని పురాతన ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం పిఎసిఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు, ఆయన సతీమణి మోరంపూడి అనసూయ వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 108 సార్లు చాలీసా పారాయణం చేసి, వందలాది మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల ప్రముఖులు పాల్గొన్నారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.