నూజివీడు మండల వ్యాప్తంగా టిడిపి వేడుకలు

283చూసినవారు
నూజివీడు మండల వ్యాప్తంగా టిడిపి వేడుకలు
నూజివీడు మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ వసంత వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. పార్టీ స్థాపకులు చూపిన మార్గంలో నడుస్తూ ప్రజల సేవకు అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేయాలని ప్రమాణం చేశారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you