నూజివీడులో విషాదం.. వడగాడ్పులకు వృద్ధురాలు మృతి!

నూజివీడు మండలం దిగవల్లి గ్రామానికి చెందిన దుమ్మనబోయిన తిరుపతమ్మ(65) వడగాడ్పుల తీవ్రత కారణంగా సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆమె భర్త రెండేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు బయటకు రావద్దని వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
