రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి

696చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి
మహారాష్ట్రలోని పుణే ఖండాల ఘాట్ రోడ్డులో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నూజివీడుకు చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు, బుక్క శివ (44), అల్లు అరవింద్ కుమార్ (44) మృతి చెందారు. విధుల్లో భాగంగా లారీలో వెళ్తుండగా, వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన వీరిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

సంబంధిత పోస్ట్