మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన పత్రిక యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలకొల్లు పోలీస్ స్టేషన్లో వైసిపి నాయకులు రజిని కుమార్ కు గురువారం ఫిర్యాదు చేశారు. పాలకొల్లు
వైసీపీ ఇన్చార్జ్ గుడాల గోపి ఆధ్వర్యంలో పాలకొల్లులో
వైసీపీ నేతలు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ, పత్రికల ద్వారా మహిళలపై అనుచిత కథనాలు ప్రచురించడం సిగ్గుచేటు అని, మహిళలందరికీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.