పాలకొల్లు పట్టణంలోని చిన్న కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పాలకొల్లు కూటమి నాయకులు, భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారికి విశేష పూజలు కూడా నిర్వహించారు.