పాలకొల్లు మండలం చింతలగరువు స్కూల్లో పద్మభూషణ్, ప్రజా కవి గుర్రం జాషువా జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొల్లాబత్తుల సూర్యకుమార్ మాట్లాడుతూ జాషువా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త యం. నిర్మల కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.