అన్ని వృత్తులలోకెల్లా పవిత్రమైనది జర్నలిజం.. మంత్రి నిమ్మల

774చూసినవారు
అన్ని వృత్తులలోకెల్లా పవిత్రమైనది జర్నలిజం.. మంత్రి నిమ్మల
సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. గ్రామీణ విలేకరులు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని ప్రజలకు నాణ్యమైన సమాచారాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు. పాలకొల్లులోని కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ హాలులో సి. ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల రెండో రోజు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్