పాలకొల్లు పట్టణంలో ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు నేతృత్వంలో పూలపల్లి వై జంక్షన్ వద్ద సమావేశమైన రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నేరకు ఫీడ్ రేట్లు పూర్తిగా తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ఫీడ్ షాపులను మూయించి వేశారు. మరికొందరు ఫీడ్ యజమానులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.