బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి గుడాల గోపి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కొన్ని విషయాలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించారని గోపి తెలిపారు.