నీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, కాలువలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రాజెక్టుల పనుల గురించి మంత్రి నిమ్మల రామానాయుడుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.