పాలకొల్లు హెడ్ పోస్టాఫీసులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పార్సిల్ ప్యాకింగ్ యూనిట్ ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలు తమ వస్తువులను అక్కడే ప్యాక్ చేసి, పోస్ట్ చేసే సౌకర్యం కల్పించారు. ఈ సదుపాయం వల్ల ప్రజల సమయం ఆదా అవుతుంది. ఈ కార్యక్రమానికి భీమవరం డివిజనల్ హెడ్, ఎస్ఎస్పీఓ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'డాక్ సేవ - జనసేవ' నినాదంతో ఈ యూనిట్ ను ప్రారంభించారు.