సమాజంలో గౌరవంగా జీవిస్తున్న మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న
వైసీపీ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
టీడీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ రజినికి
టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇటీవల
వైసీపీ కార్యకర్త రాము,
టీడీపీ నాయకుడు సత్యనారాయణ భార్యను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.