పశ్చిమగోదావరి జిల్లా లంకలకోడేరు పీహెచ్‌సీలో డాక్టర్ నవ్య జీవన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పిహెచ్‌సీ సిబ్బంది, ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ నవ్య జీవన్ సూచించారు. వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆశా కార్యకర్తలకు, సిబ్బందికి అవగాహన కల్పించారు.