పాలకొల్లులో అర్థనగ్న ప్రదర్శన చేపట్టిన వైసీపీ నాయకులు

514చూసినవారు
పాలకొల్లులో కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని నిరసనగా వైసిపి శ్రేణులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. పూలపల్లి నుండి వైసిపి కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, యాళ్లవాని గరువు వై జంక్షన్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అబద్ధపు హామీలతో గెలిచిన కూటమికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని వైసిపి ఇన్చార్జ్ గోపి తెలిపారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్