
పాలకొల్లు: 40 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు
పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల జడ్పీ హైస్కూల్లో 40 సంవత్సరాల క్రితం చదివిన పూర్వ విద్యార్థులు మంగళవారం ఒకచోట చేరారు. 1981-85 మధ్యకాలంలో చదువుకున్న వీరంతా తమ కుటుంబాలతో కలిసి పాఠశాలకు వచ్చి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు, తరగతి గదిలో కూర్చుని ఫోటోలు దిగారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించి, చిన్నారుల వలె గ్రూప్ ఫోటోలు దిగారు.






































