పాలకొల్లు - Palakollu

కొంటామంటూ నటించి...కొట్టేస్తారు!

కొంటామంటూ నటించి...కొట్టేస్తారు!

బంగారం, వెండి షాపుల్లో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చినట్టుగా నటించి చోరీలు చేస్తున్న ఐదుగురు మహిళలను జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన ఈ ముఠా, ఈనెల 9న కాకినాడ జిల్లా జగ్గంపేటలోని శ్రీ కార్తికేయ జ్యువెలరీ షాపు నుంచి 350 గ్రాముల బరువు గల 8 జతల వెండి పట్టీలను దొంగిలించింది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మంగళవారం ఐదుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. దొంగిలించిన వెండి పట్టీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా