
కంకిపాడు: తగ్గుముఖం పట్టిన వరద
మూడు రోజులుగా భారీగా కృష్ణా నదికి చేరుతున్న వరద నీరు శుక్రవారం ఉదయానికి తగ్గింది. ఆరు లక్షల క్యూసెక్కుల నుంచి 1.98 లక్షల క్యూసెక్కులకు వరద నీటి ప్రవాహం తగ్గడంతో పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాల ప్రజలు ప్రస్తుతం పడవల్లో ప్రయాణిస్తున్నారు.



































