
పట్టుబడిన మావోయిస్టులకు రిమాండ్ పొడిగింపు
పెనమలూరులో పట్టుబడిన మావోయిస్టుల రిమాండ్‌ను కోర్టు ఈనెల 29 వరకు పొడిగించింది. జైలు అధికారులు ఇవాళ వారిని న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌గా హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి రిమాండ్‌ను కొనసాగించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 24 మంది మావోయిస్టులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.







































