
తాడిగడప: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన ప్రైవేటు వ్యక్తులు
విజయవాడ - బందరు జాతీయ రహదారిపై తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గురువారం వైసీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. గతంలో సీఎం చంద్రబాబు ఒక్క సెంటు భూమి కబ్జాకు గురైనా తాట తీస్తానని ప్రకటించారని వైసీపీ నేతలు ఆరోపించారు.





































