
పెనమలూరు: కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మంగళగిరి టీడీపీ ఆఫీసులో సోమవారం జరిగిన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల ట్రైనింగ్ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 'సూపర్-6' హామీలను అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి సంపూర్ణ మద్దతు కూడగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.







































