బుట్టాయిగూడెం: శాకాంబరిగా గుబ్బల మంగమ్మ దర్శనం

1234చూసినవారు
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలోని శ్రీ గుబ్బల మంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.