బుట్టాయిగూడెం మండలం కొవ్వాడకు చెందిన కుంజం వెంకన్నబాబు గురువారం రాత్రి జడ్పీ హైస్కూల్ సమీపంలోని అభయాంజనేయ స్వామి ఆలయాన్ని తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వెంకన్నబాబును స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా బుట్టాయిగూడెం సీహెచ్సీకి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ఆయన మృతి చెందారు.